- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని ఏడవ వార్డులో ఒక వీధిలో గత నెల రోజుల క్రితం కాలువ పనులు నిర్వహించేందుకు అధికారులు గుంతలు తవ్వించారు. నెల రోజులుగా ఆ కాలువ పనలు పూర్తి చేయకపోగా.. గుంతను సైతం యధావిధిగా వదిలేశారు. దీంతో వాహనాదారులకు, పాదచారులకు, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
- Advertisement -



