Saturday, May 23, 2026
E-PAPER
Homeఖమ్మంమల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (ఆర్ఎంఎస్)” కార్యక్రమం ముగింపు సభ శుక్రవారం మల్లాయిగూడెం లో ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమాన్ని అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్. కె. శిరీష సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వరి రకాల ఎంపిక, వేరుశెనగ సాగులో సాంకేతిక విధానాలు, ఆయిల్‌పామ్‌లో పోషక నిర్వహణ, నీటి యాజమాన్యంపై రైతులకు వివరించారు. అధిక దిగుబడులు, తక్కువ వ్యయంతో స్థిరమైన ఆదాయం సాధించేందుకు శాస్త్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని సూచించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆత్మ( బీఎఫ్ఏసీ )చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో శాస్త్రవేత్తలు రైతులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వ్యవసాయ విజ్ఞానాన్ని అందించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను అవగాహన చేసుకోవడం భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వ్యవసాయ నిపుణులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు.

సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ సంగం వెంకటమ్మ మాట్లాడుతూ రైతులకు ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, నారాయణపురం పశువైద్య అధికారి డా. వినయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు షకీరా భాను, సతీష్ పాల్గొని పంటల సాగు, పశుసంవర్ధక నిర్వహణ, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై రైతులకు సూచనలు అందించారు.

డా. కె. శిరీష మాట్లాడుతూ కార్యక్రమ విజయానికి సహకరించిన రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ పరిస్థితులను పరిశీలించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -