– మీడియా స్వేచ్ఛను అరంచి వేస్తున్న అరాచక వాదులు
– అరాచక వాదులను అన్ని పార్టీలు బహిష్కరించాలి
– డిప్యూటీ సీఎం, మల్లు నందినీలకు చెడ్డ పేరు తీసుకు వస్తున్న అరాచక వాదులు
– సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
నవతెలంగాణ – బోనకల్ : మీడియా ప్రతినిధులపై అరాచకవాదుల దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని, మీడియా స్వేచ్ఛను హరించి వేస్తున్న అరాచక వాదులను అన్ని పార్టీల వారు బహిష్కరించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు మండల కార్యదర్శి కిలారు సురేష్ కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల కేంద్రంలో గల స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో ఆదివారము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమపై వార్తా కథనాలు రాశారనే కక్షతో మండల పరిధిలోని చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన పిల్లి రాహుల్, పాకాలపాటి మోహన్ రాయ్ కాంగ్రెస్ పేరుతో అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తూ చివరకు మీడియా ప్రతినిధులపై దాడులు చేయటం హేయమైన చర్య అని వారు తీవ్రంగా ఖండించారు. పిల్లి రాహుల్, పాకాలపాటి మోహన్ రాయ్ ప్రతి విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి మల్లు నందిని పేరు చెబుతూ అరాచకాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి వలన, కాంగ్రెస్ కు చెడ్డపేరు వస్తుందని వారు తెలిపారు. డిప్యూటీ సీఎం, మల్లు నందిని ఇటువంటి అరాచక వాదులను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. అరాచకాలు, తప్పుడు పనులు, దౌర్జన్యాలు చేస్తూ కాంగ్రెస్ పేరు చెబుతున్నారని వారు తెలిపారు. తమపై వార్తా కథనాలు రాసారని కక్షతో పథకం ప్రకారం ఒకే రోజు ముగ్గురు విలేకరులపై దౌర్జన్యాలు, దాడులు చేశారన్నారు. గత కొన్ని రోజులుగా వీరు ఓ ముఠాగా ఏర్పడి కారులో తిరుగుతూ తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై దాడు చేయటాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని వారు కోరారు. సమాజంలో మీడియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. దాడులు చేయటం, అరాచకాలు చేయటం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదన్నారు. వార్తా కథనాలు వచ్చిన సందర్భంలో వాటికి పిల్లి రాహుల్ పాకాలపాటి మోహన్రాయ్ వివరణలు, ఖండనలు సంబంధిత విలేకరులు వార్త కథనాలు ఇచ్చారని అయినా వారిపై రౌడీయిజం, దౌర్జన్యం చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న అటువంటి వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వారు మరింత తెగబడే ప్రమాదం ఉందని దీనివలన మీడియా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి కూడా ఉండదన్నారు. పోలీసులు కూడా ఇటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని వారు కోరారు. కాంగ్రెస్ ముసుగులో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ, తమపై వార్తలు రాసిన మీడియా ప్రతినిధులపై దాడులు చేస్తున్న వారి పట్ల డిప్యూటీ సీఎం, మల్లు నందిని లు అప్రమత్తంగా ఉండాలని లేనియెడల మీకు ఇటువంటి అరాచకవాదుల వల్ల చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, తెల్లాకుల శ్రీనివాసరావు గూగులోత్ నరేష్, ఏసుపోగు బాబు, బూర్గుల అప్పాచారి తదితరులు ఉన్నారు.
మీడియా ప్రతినిధులపై దాడులను ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



