Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిష వ్యాపారం

విష వ్యాపారం

- Advertisement -

లాభాలు మూటకట్టుకుంటున్న
కాలుష్య కంపెనీలు
పారిశ్రామిక వ్యర్థాలపై పోప్ లియో ఆగ్రహం

అసెర్రా (ఇటలీ) : పర్యావరణ కాలుష్యానికి కారణమవుతూ పెద్ద ఎత్తున లాభాలు మూటకట్టుకోవాలని చూస్తున్న కంపెనీలపై పోప్ లియో ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వ్యర్థాలను పారవేస్తున్న ఓ ప్రాంతాన్ని శనివారం ఆయన సందర్శించారు. అసెర్రా అనే ఈ ప్రాంతం రోమ్‌కు దక్షిణంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సందర్శించిన మొదటి అమెరికా పోప్ ఆయనే కావడం విశేషం. భూమి, నీరు, గాలి, సామాజిక సహజీవనాన్ని కలుషితం చేసే పద్ధతులను అనుసరిస్తున్న వారిని తిరస్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యర్థాల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల కుటుంబసభ్యులను కలుసుకొని, వారి కన్నీరు తుడవడానికే ఇక్కడికి వచ్చానని లియో చెప్పారు. ఈ ప్రాంతంలో 1988 నుంచే వ్యర్థాలను డంప్ చేస్తున్నప్పటికీ బాధిత ప్రజలను కాపాడడంలో అధికారులు విఫలమయ్యారంటూ గత సంవత్సరం యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం తీర్పు చెప్పింది. అసెర్రాకు చేరుకున్న లియోకు పసుపు‘తెలుపు వాటికన్ పతాకాలు ఊపుతూ, పసుపు టోపీలను ధరించిన ప్రజలు స్వాగతం పలికారు. వారిలో కొందరు మరణించిన తమ కుటుంబ సభ్యుల చిత్రాలతో కూడిన పోస్టర్‌బోర్డులను ప్రదర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు, సంస్థలు చాలా కాలంగా శిక్ష నుంచి తప్పించుకుం టూ స్వేచ్ఛగా సంచరిస్తున్నారని లియో మండిపడ్డారు. అసెర్రాలో నాలుగు గంటల పాటు గడిచిన పోప్ లియో అనేక మంది బాధితులను కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -