Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల వేతనాలకు 'బీపీపీ' కత్తెర..

కార్మికుల వేతనాలకు ‘బీపీపీ’ కత్తెర..

- Advertisement -

18 నెలల బకాయిలపై 
అధికారుల మొండిచేయిఒక్కొక్కరి వేతనాల నుంచి రూ.4 వేలు కట్!
140 మంది కార్మికులకు 
72వేల చొప్పున నష్టం
కోర్టు కేసుల సాకుతో బకాయిల ఎగవేతన్యాయం చేయాలని ప్రభావాణిలో వినతి..
 స్పందన కరువు?

నవతెలంగాణ-సిటీబ్యూర్లో
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, పర్యాటక ప్రాంతాలను కాపాడుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కాంట్రాక్టు కార్మికుల పొట్ట కొడుతున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి పట్ల అత్యంత దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోత విధించి, ఇప్పుడు ఆ బకాయిలను చెల్లించడంలో అధికారులు మొండికేస్తున్నారు. దాదాపు 18 నెలలకు సంబంధించి ఒక్కో కార్మికుడికి నెలకు రూ.4 వేల్ల చొప్పున బకాయిలు ఉన్నా, కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసన రూపంలో హౌస్ కీపింగ్ కార్మికులు తెలియజేయడంతో పాటు సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన.. హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.

​జీవోల మార్పుతో తీరని నష్టం!
హెచ్ఎండీఏ పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని పార్కులు, రోడ్ల నిర్వహణల్లో సుమారు 140 మంది హౌస్ట్ కీపింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 2023 జనవరి వరకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు అందేవి. అయితే, 2023 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2024 వర్లకు జరిగిన టెండర్ ప్రక్రియలో అధికారులు కుట్రపూరితంగా జీవో 60ని పక్కన పెట్టి, తక్కువ వేతనం ఉండే జీవో 11ని వర్తింపజేశారు. దీనివల్ల కార్మికుల వేతనాల్లో కోత్త పడింది. ఫలితంగా ఒక్కో కార్మికుడు నెలకు రూ.4వేల చొప్పున్ల జీతాన్ని కోల్పోయారు. అసలే చాలిచాలనీ వేతనాలకు తోడు.. భారీ కోత పెట్టడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీటికితోడు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఈ వేతన కోత గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.

కోర్టు కేసుల సాకుతో ఎగవేత!
కార్మికుల నిరంతర పోరాట ఫలితంగా నవంబర్ 2024 నుంచి తిరిగి జీవో 60ని వర్తింపజేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే. ఫిబ్రవరి 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు (18 నెలల కాలం) కోత విధించిన బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. ఈ బకాయిలపై అధికారులు హైకోర్టులో కేసు ఉందన్న సాకును చూపుతున్నారు. వాస్తవానికి అధికారులే టెండర్ నిబంధనల్లో జీవో 60ని చేర్చడంతో కార్మికులు 2024లోనే తమ కేసును ఉపసంహరించుకున్నారు. కోర్టులో కేసు లేకపోయినా, ఇంకా కేసు ఉందనే సాకుతో అధికారులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

​వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు..
ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, సంజీవయ్య షార్క్, లేక్ ఫ్రంట్ పార్క్, నెక్లెస్డ్, అంబేద్కర్ విగ్రహాం, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ రోడ్, స్లాగర్ షార్క్, పీపుల్స్ ప్లాజా వంటి ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తున్నా. తమ కష్టానికి తగిన ఫలితం అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక్కో కార్మికుడు సుమారు రూ.72,000 వరకు నష్టపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బుద్ధ పూర్ణిమ్ల ప్రాజెక్టు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి, తమ 18 నెలల వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కష్టజీవులు కోరుతున్నారు.

​ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
తమ వేతనాల కోసం కార్మికులు గతంలో ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. అయితే అదికారుల నుంచి మాత్రం అరకొర సమాధానాలే వస్తున్నాయి. హైకోర్టు కేసును అడ్డుపెట్టుకుని కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం మానాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ వంటి కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

​జీహెచ్ఎంసీతో పోలిస్తే వివక్ష
ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ, జీహెచ్ఎంసీ కార్మికులకు, హెచ్‌ఎండీఏ కార్మికులకు మధ్య వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంది. జీహెచ్ఎంసీ కార్మికులకు రూ.17 వేలకు పైగా వేతనం అందుతుండగా, హెచ్ ఎండీఏ కార్మికులకు కేవలం రూ.15,600 మాత్రమే ఇస్తున్నారు. అంతే కాకుండా, జీహెచ్ఎంసీలో ఉన్నట్లుగా వీరికి ప్రమాద బీమా సౌకర్యం లేదు.

​గ్యారంటీ లేని కార్మికుల ప్రాణాలు
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. ఇటీవల నెక్లెస్ రోడ్‌‌లో విధి నిర్వహణలో ఉండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా వజ్రమ్మ అనే కార్మికురాలి కాలు విరిగితే, సంస్థ నుంచి ఎలాంటి సాయం అందలేదు. గతంల్లో నెక్లెస్ రోడ్‌‌లో ఎంఎంటీఎస్ వద్ద జరిగిన ప్రమాదంలో ఎల్లమ్మ అనే కార్మికురాలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది కార్మికులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కార్మి కులకు ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. అధికారుల్లో చలనం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -