- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ. 2.84, అటు డీజిల్ పై రూ. 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే నాలుగు సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది.
- Advertisement -



