- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో నాగేశ్వర్ ఇంటి వద్ద తెలంగాణ పోలీసులను మోహరించారు. తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్న విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
- Advertisement -



