Monday, February 2, 2026
E-PAPER
Homeఖమ్మంమైనారిటీలకు 10 శాతం పదవులు కేటాయించాలి

మైనారిటీలకు 10 శాతం పదవులు కేటాయించాలి

- Advertisement -

– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ 

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 న జరుగనున్న 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన స్థానాల్లో  మైనారిటీ వర్గాలవారికి 10 శాతం చైర్మన్, చైర్ పర్సన్ మరియు మేయర్ పదవులలో ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మైనారిటీ వర్గాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దపీట వేశాయని గర్తు చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మైనారిటీలు రాజకీయంగా ఎదిగేందుకు తగు సహకారం అందించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఎండీ.యాకూబ్ పాషా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -