Wednesday, May 27, 2026
E-PAPER
Homeఖమ్మంలైంగిక అరాచకత్వం నివారణోపాయంపై అవగాహన

లైంగిక అరాచకత్వం నివారణోపాయంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పీఓఎస్ హెచ్ (ప్రివలెన్స్ ఆఫ్ సెక్సువల్ హరాస్ మెంట్) పనీప్పైరదేశాల్లో మహిళలు పై లైంగిక హరాసకత్వం నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ అలేఖ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపుల నుంచి రక్షించుకునే మార్గాలు, ఎదురయ్యే పరిస్థితుల్లో చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అనంతరం జాఫియా మాట్లాడుతూ టీ – షీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసే విధానం, అలాగే ఇంటర్నల్ కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దారా కిశోర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి,ఇంచార్జ్ ఎంపీడీఓ రామ కోట రెడ్డి ,సూపర్వైజర్ సౌజన్యతో పాటు వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -