Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సమైక్య భవన నిర్మాణాలకు భూమిపూజ..!

గ్రామ సమైక్య భవన నిర్మాణాలకు భూమిపూజ..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్య భాగంగా మండలంలోని ఎడ్లపల్లి, కొండంపేట, వల్లెంకుంట గ్రామాల్లో గ్రామైక్య సంఘం భవనాల నిర్మాణాల కోసం ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షల ఈజిఎస్ నిధులచే గ్రామైక్య సంఘాల కార్యాలయ భవన నిర్మాణాలకు గురువారం ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, సర్పంచ్లు జంగిడి శ్రీనివాస్, బెల్లంకొండ జ్యోత్స్న-సరిన్ రావు, బొమ్మ రజిత-రమేష్ రెడ్డి, కొండ రాజమ్మలచే భూమి పూజ నిర్వహించడం జరిగిందని మండల ఏపీఎం హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు, చల్లా మల్లారెడ్డి, జనగామ లక్ష్మి రాజు, ముకుందరెడ్డి, సమ్మిరెడ్డి, సీసి రవికుమార్, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -