- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలలో జక్రాన్ పల్లి గ్రామంలో మైనార్టీ సోదరులు ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారని మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి మైనార్టీ సోదరులు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాల కచ్చితంగా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇతార మతాలవారు మైనార్టీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలు
రాజకీయ పార్టీల నాయకులు మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఆఫీస్ రహమత్ అలీ మాజీ కో ఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ సదర్ నియామత్ అలీ షేక్ సలీం షేక్ బషీర్ ఫెరోస్ బిన్ యూసుఫ్ షేక్ నజీర్ , మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



