Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి : ఏసీబీ

లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి : ఏసీబీ

- Advertisement -

నవతెలంగాణ – నాచారం : నాచారం సర్కిల్ కార్యాలయం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. “మిమ్మల్ని ఎవరైనా లంచం అడుగుతున్నారా..?” అంటూ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలు తమ పనుల కోసం ఎలాంటి లంచాలు ఇవ్వవద్దని, ఎవరైనా డిమాండ్ చేస్తే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

పారిశుధ్యం, ఇంటి పన్నులు, భవన అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, రోడ్ల నిర్మాణాలు, ఓటరు జాబితా నమోదు వంటి పలు పనుల కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైనా అధికారి లేదా ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఏసీబీ అధికారిక వెబ్‌సైట్ తెరుచుకుంటుంది. అందులో తెలుగు లేదా ఇంగ్లీషు భాషను ఎంచుకుని ఫిర్యాదు చేయవచ్చు. లంచం అడిగిన అధికారి పేరు, శాఖ, హోదా, ఎంత మొత్తం డిమాండ్ చేశారో నమోదు చేయాల్సి ఉంటుంది.ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలోని అన్ని సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల వద్ద ఈ ఏసీబీ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -