Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వాలి

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మా గ్రామ ఇసుకను  మా గ్రామ లబ్ధిదారులకు ఇవ్వాలని వేరే గ్రామ  ఇసుక మాకొద్దు అంటూ బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ ఆధ్వర్యంలో లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం బీర్కూర్‌ ఇందిరమ్మ లబ్ధిదారులు సర్పంచ్ ధర్మతేజ కలిసి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.అనంతరం తహసీల్దార్‌ సవాయిసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామస్థులు, గ్రామ సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ. బీర్కూరు గ్రామ శివారులో  ఉన్న  మంజీరా పరివాహక  ప్రాంతంలో ఉన్న ఇసుక ఇవ్వకుండా, దూరంలో ఉన్న చించోలి గ్రామ శివారు నుంచి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బీర్కూర్ గ్రామ శివారులో ఉన్న ఇసుక కారిని ప్రారంభించి బీర్కూర్ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. చించోలి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ యజమానులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ధరలు పెంచడంతో ఇబ్బందిగా మారిందన్నారు మూడు కిలోమీటర్ల దూరం 2500 వసూల్ చేయడం బాధాకరంగా ఉందన్నారు. బీర్కూర్ క్వారీ నుంచి ఇసుక తీసుకోటానికి అనుమతులు ఇస్తే ఒక్కో ట్రాక్టర్‌కు అతి తక్కువ ధరకు వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు తహసీల్దార్‌ను కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇసుక అనుమతులు ఇప్పిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -