మండలం అభివృద్ధి చెందాలంటే నాగజ్యోతి గెలవాలి

– ఎండి బాబర్ మండల కోఆప్షన్ సభ్యులు
నవతెలంగాణ-గోవిందరావుపేట : అన్ని రంగాల్లో మండలం అభివృద్ధి చెందాలంటే బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నాగజ్యోతి గెలవాలని మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి బాబర్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రజలను తరలించారు. ఈ క్రమంలో బాబర్ మాట్లాడుతూ అధికారంలో లేని ఎమ్మెల్యేలు ఎన్నుకొని చాలా నష్టపోయామని అన్నారు. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా చేసిన తప్పును సరిదిద్దుకునే విధంగా టిఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిని గెలిపించి మండల అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు ఆశీర్వాద సభలో స్పష్టమైన హామీలు ఇవ్వనున్నారని ఈ హామీలతో జ్యోతి గెలుపు ఖాయమని మన జీవితాలు జ్యోతిలా వెలగాలంటే నాగజ్యోతి గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love