– బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతుల నిరసన
నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు.ఐకేపీ సెంటర్ వద్ద ఆలేరు–సిద్దిపేట హైవే రోడ్డును దిగ్బంధం చేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 35 శాతం మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు.ఇంకా 65 శాతం ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రోహిణి కార్తె వచ్చినా కూడా ధాన్యం కొనుగోలు పూర్తి చేయక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.స్థానిక ఎమ్మెల్యే సైకిల్ యాత్రలు చేస్తూ వారం రోజుల్లో వడ్ల కొనుగోలు పూర్తి చేస్తామని రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పడం కేవలం అబద్ధపు హామీలేనని ఆరోపించారు.రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని,రాబోయే రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు,సర్పంచ్ యకమ్మ వెంకటేష్,గ్రామశాఖ అధ్యక్షులు జంగా స్వామి,పీఏసీఎస్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్,విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మామిడాల భానుచందర్, మామిడాల సోమయ్య, బాలమల్లేష్, గడ్డం నాగరాజు, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య, తెరల శంకర్, సంపత్, ప్రవీణ్, పాండు, బాలరాజు, నరేష్, శంకరయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
వడ్లు కొనుగోలు చేయాలని హైవే దిగ్బంధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



