Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్పునుంతల మండలంలో నష్టాలు, రైతుల్లో ఆనందం

ఉప్పునుంతల మండలంలో నష్టాలు, రైతుల్లో ఆనందం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం దంచికొట్టింది. రోహిణి కార్తి ప్రారంభ దశల్లోనే కుండపోత వర్షం కురవడంతో భూమి చల్లబడగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల సాగుకు రైతులు సన్నాహాలు ప్రారంభించారు. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉప్పరపల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ బుడ్డి కిందపడగా, తాడూరు, వెల్టూరు, గువ్వలోనిపల్లి గ్రామాలు, జాతీయ రహదారి వెంట దాదాపు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నెలకు వాలిపోయాయి. దీంతో మండలంలోని అనేక గ్రామాల్లో కాసేపు వరకు విద్యుత్ అంతరాయం నెలకొంది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ కొండల్ సంఘటనా స్థలాలను పరిశీలించి సిబ్బందితో మరమ్మతు పనులు వేగవంతం చేశారు. కాంసానిపల్లి, వెల్టూరు గ్రామాల చెరువులు అలుగు పారగా, చెరువుల్లోకి భారీగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. ఈదురు గాలులకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడగా, జాతీయ రహదారి వెంట ఉన్న సూచిక బోర్డులు నేలకూలాయి. నీటి ప్రవాహంతో రైతులు చదును చేసుకున్న పొలాలు కోతకు గురయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్ల రేకులు ఎగిరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

రాత్రి రెండు గంటలకు పైగా నిరంతరంగా కురిసిన ఈ తొలకరి వర్షం ఈ ఏడాది మొదటిసారిగా భారీ స్థాయిలో నమోదైందని రైతులు చర్చించుకుంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -