Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో మహిళలకు ఆర్థిక చేయూత

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో మహిళలకు ఆర్థిక చేయూత

- Advertisement -


నవతెలంగాణ – భిక్కనూర్ (రాజంపేట్)
రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో‌ గ్రామ సర్పంచ్ కీసరి కృష్ణ, ఉప సర్పంచ్ బూరుగుపల్లి వెంకా గౌడ్ సమక్షంలో మహిళా సంఘాల సభ్యులకు వివిధ రుణాలు, ఆర్థిక సహాయాలు అందజేశారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం రాజారెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల మహిళలకు గడ్డి కత్తిరించే యంత్రం కోసం రూ.50 వేలు, నాటు కోళ్ల పెంపకం కోసం రూ.3 లక్షల రుణం మంజూరు చేయడం జరిగిందని, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో రూ.3 లక్షల ఆర్థిక సహాయం, క్రాంతి సంఘ సభ్యులకు చేపల వ్యాపారం కోసం రూ.30 వేల ప్రోత్సాహకం, వికలాంగుల సంఘం కిశోర బాలికల కోసం కొత్త సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ గంగా ప్రసాద్, సిఎలు రజిత, భాగ్యలక్ష్మి, సాయిలు, గ్రామ సంఘ ప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -