Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాలకు రూ.5 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలు

మహిళా సంఘాలకు రూ.5 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలు

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్: మండలంలోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బ్యాంకు లింకేజి గ్రౌండింగ్ మేళా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని 36 స్వయం సహాయ మహిళా సంఘాలకు రూ.5 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలను అందజేశారు.ఈ రుణాలను వినియోగించుకొని మహిళలు వివిధ ఆదాయ అభివృద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని,అలాగే ఈ రుణాలకు వడ్డీ లేని సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.సభ్యురాలికి రూ.2 లక్షల వరకు లోన్ బీమా,రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తాయని వివరించారు.మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం నరహరి,టీజీపీ అల్లిపూర్ బ్యాంకు మేనేజర్ రాజేష్,యూబిఐ ఇటిక్యాల బ్యాంకు మేనేజర్ వినయ్,యూబిఐ రాయికల్ బ్యాంకు మేనేజర్ నరేష్, ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్,వివిధ గ్రామాల వివో అధ్యక్షులు,వివోఏలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -