Saturday, May 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందేశంలో రోజుకు 3,400 అదనపు మరణాలు

దేశంలో రోజుకు 3,400 అదనపు మరణాలు

- Advertisement -

మరో ఐదు రోజులు ఇలాగే కొనసాగితే
ఈ సంఖ్య 30వేలకు చేరే అవకాశం

తీవ్రమైన ఎండలు, వడగాలుల బీభత్సానికి పిట్టల్లా రాలిపోతున్న జనం
ఐదు రాష్ట్రాల్లోనే అత్యధిక మరణాలు
ఒక్క యూపీలోనే 8,100 మంది మృతి
దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ ముప్పు
‘అమెరికాలోని కాలిఫ్నోరియా బర్కిలీ వర్సిటీ’లోని ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ సెంటర్‌ అధ్యయనంలో వెల్లడి


కాలిఫోర్నియా: ఎండలు మండిపోతున్నాయి. భరించలేని ఉక్కపోత, వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. భానుడి భగభగలతో ఎన్నడూ లేనంతగా ఆకాశంపై నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్టుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా వడగా లులు బీభత్సం సృష్టిస్తున్న వేళ ‘అమెరికాలోని కాలిఫోర్నియా బర్కిలీ వర్సిటీ’లోని ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ సెంటర్‌ అధ్యయనం సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించింది. దేశంలో తీవ్రమైన ఎండ, వడగాలులతో రోజుకు సగటున సుమారు 3,400 అదనపు మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా వేసింది. ఇదే అధ్యయనం మరో భయంకరమైన విషయాన్నీ వెల్లడించింది. ఈ వడగాల్పుల తీవ్రత వరుసగా మరో ఐదు రోజుల పాటు కొనసాగితే, ఆ మరణాల సంఖ్య ఏకంగా 30 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. పర్యావరణ మార్పులు దేశంలోని ప్రజల మరణాలకు ఎలా కారణం అవుతున్నాయనేది ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ’కి చెందిన ‘ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్’ పరిశోధకులు పియూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ ఈ అధ్యయనం చేశారు. భారత్‌‌లోని ఆయా రాష్ట్రాల్లో ఈ మరణాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయన బృందం దేశంలోని 10 నగరాల్లో తీవ్రమైన ఎండ, వడగాలుల సంబంధిత మరణాలను విశ్లేషించింది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. దేశంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) నుంచి సేకరించిన జిల్లా స్థాయి మరణాల రికార్డులు, 2024 జనాభా అంచనాలను విశ్లేషించి పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు.

‘అదనపు మరణాల’ డేటా ఆధారంగా విపరీతమైన వేడి వల్లే సంబంధిత మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచవ్యాప్త అధ్య యనాలు చెబుతున్నప్పటికీ భారత్‌‌లోని పలు రాష్ట్రాల్లో వడగాలులు మరణాలను ఎలా ప్రభావితం చేస్తా యనే దానిపై సరైన సమాచారం అందుబాటులో లేదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నమోదైన ‘అదనపు మరణాలు’ డేటా ఆధారంగా పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. ప్రజారోగ్యం విభాగంలో ‘అదనపు మరణాలు’ అనేది ఒక నిర్దిష్టమైన కొలమానంగా చెబుతుంటారు. అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారులు, తీవ్రమైన వడగాల్పుల సమయంలో సాధారణం సంఖ్య కంటే ఎక్కువగా నమోదయ్యే మరణాలనే ‘అదనపు మరణాలు’ అని పరిగణిస్తారు. ఆ మరణాల ఆధారంగానే పరిశో ధకులు ఈ నివేదికను రూపొం దించారు. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్, రాజస్తా న్, ఉత్తర్‌‌ప్రదేశ్‌, హర్యా నాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను మించిపోయాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో తీవ్రమైన వడగాలులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంభవించే మొత్తం ఎండ మరణాల్లో సింహభాగం ఈ ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరణాలు నమోదవు తున్నాయని తెలిపింది. ఐదు రోజుల వడగాలుల సమయంలో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 8,100 అదనపు మర ణాలు సంభవించాయని వెల్లడించింది. అదే సమ యంలో అహ్మదాబాద్, జైపూర్, సూరత్ వంటి రాష్ట్రాల్లో ఒక్కోసారి 250కి పైగా అదనపు మరణాలు సంభవించాయని తమ నివేదికలో పేర్కొంది.​

వంద జిల్లాల్లోనే 44 శాతం అదనపు మరణాలు
దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఈ తీవ్రమైన వడగాల్పుల ముప్పు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ఐదు రోజుల పాటు తీవ్రమైన హీట్‌వేవ్ వస్తే సంభవించే అదనపు మరణాలలో 44 శాతం మరణాలు వంద జిల్లాల్లోనే నమోదయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే ఈ వంద జిల్లాల్లో దేశ జనాభాలో దాదాపు మూడో వంతు ప్రజలు నివసిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే హీట్ వేగా ప్రకటిస్తారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే వాటిని ‘తీవ్రమైన వడగాలులు’గా వర్గీకరిస్తారు. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల దాటిన వేళ ఈ అధ్యయనం ప్రభుత్వానికి మేలుకొలుపు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముప్పు తీవ్రతను బట్టి కేంద్రం నిధులివ్వాలి
‘‘ తీవ్ర వేడి కారణంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు సుమారు 3,400 అదనపు మరణాలు సంభవిస్తున్నాయని మేము అంచనాకు వచ్చాం. ఐదు రోజుల వడగాలుల వల్ల దాదాపు 30 వేల మంది మరణిస్తారు. ఎండల వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఐదు రాష్ట్రాలు దేశ జీడీపీకి (జీడీపీ) అందిస్తున్న వాటా కేవలం 29 శాతం. కానీ మరణాల భారంలో వీటి వాటా 66 శాతంగా ఉంది. అంటే వెనుకబడిన రాష్ట్రాలపై వాతా వరణ మార్పుల ప్రభావం 2.3 రెట్లు ఎక్కువ పడుతోంది. అం దుకే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ అథారిటీ , వాతావరణ మార్పులపై జాతీయ కార్యా చరణ ప్రణాళిక కింద ఇచ్చే కేంద్ర నిధులను కేవలం జీడీపీ ఆధారంగా ఇవ్వకుండా, ముప్పు తీవ్రతను బట్టి ఇస్తే బాగుటుంది” అని పరి శోధకులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -