Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతరిక్ష్యాని నడిపేది కూడ ఆడపిల్లలే: చండూరు ఆర్డీవో శ్రీదేవి

అంతరిక్ష్యాని నడిపేది కూడ ఆడపిల్లలే: చండూరు ఆర్డీవో శ్రీదేవి

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ
అంతరిక్షాన్ని కూడా నడిపేది ఆడపిల్లలే నని చండూరు ఆర్డీవో శ్రీదేవి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ సందర్భంగా ఆమె మాట్లాడారు. చదువు శాస్త్రం సాంకేతిక రంగాల్లో తమ సత్తా చాటుతూ మహిళలు అంతరిక్ష పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్నారని, రాకెట్ ప్రయోగాల నుంచి ఉపగ్రహాల నియంత్రణ వరకూ మిషన్ డిజైన్ నుంచి డేటా విశ్లేషణ వరకు ప్రతి దశలో మహిళా శాస్త్రవేత్తలు ముందుండి నడిపిస్తున్నారని గుర్తు చేశారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల భాగ్య సామ్యం దేశానికి గర్వ కారణమని చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లలో మహిళల పాత్ర చరిత్ర సృష్టించిందని ఆడపిల్లలు బలహీనులనే అపోహాలు చెరిపివేసి ఆకాశమే హద్దు కాదని నిరూపించుకోవాలని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి అభినందనీయమన్నారు. స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జిసి మున్నయ్య,పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండు రంగారావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -