Saturday, May 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

- Advertisement -

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్
అలాంటిదేమీ లేదన్న యూఎస్‌

​టెహ్రాన్‌ : అమెరికా- ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలూ పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ అధికారిక మీడియా ఒక కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను అమెరికా ఖండించింది. టెహ్రాన్‌ ‌చెప్తున్నట్టుగా అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్‌ ప్రావిన్స్‌లోని జామ్‌ ప్రాంతంలో శత్రు దేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని అడ్డగించినట్టు టెహ్రాన్‌ మీడియా తెలిపింది. ఇరాన్‌ వైమానిక దళాలు ఆ ఫైటర్‌జెట్‌ను కూల్చివేశాయని స్థానిక గవర్నర్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా.. లేదా అనే పూర్తి వివరాలను మాత్రం అది వెల్లడించలేదు. ప్రస్తుతం బుషెహర్‌ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని తెలిపింది. మరోవైపు, దాడుల్లో యుద్ధ విమానం కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్‌ ఆర్మీ ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. అయితే, ఈ వాదనలను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తోసిపుచ్చింది. బుషెహర్‌ ప్రావిన్స్‌ సమీపంలో అమెరికా విమానాన్ని కూల్చేశామంటూ ఇరాన్‌ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -