- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సింగరేణి అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు.. శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద బాల్క సుమన్ అరెస్టు చేశారు. అనంతరం ఆరున్నర గంటలపాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టగా, జడ్జి రిమాండ్ విధించారు.
- Advertisement -



