Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత సైన్యంలో ‘అగ్నివీర్ ’గా ఎంపికైన గణేష్

భారత సైన్యంలో ‘అగ్నివీర్ ’గా ఎంపికైన గణేష్

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు : మీ కృషి, పట్టుదల, అంకితభావం మరియు దేశసేవ పట్ల మీ నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం భారత సైన్యంలో అగ్ని వీరులో ఎంపికైన జి గణేష్ ను శాలువా తో ఘనంగా సత్కరించి అభినందించినట్లు ఆ గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత తెలిపారు. ఆదివారం గ్రామంలోని గ్రామసభ కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మాత సేవలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, మన శ్రీరామగిరి గ్రామానికి మరియు దేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అని అన్నారు.మీ భవిష్యత్ ప్రయాణం విజయవంతంగా సాగాలని, దేశ రక్షణలో విశిష్ట సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామగిరి సుమన్, సొసైటీ డైరెక్టర్ బెల్లి నర్సయ్య, మద్దెల సమ్మయ్య,పోరండ్ల సోమయ్య,పోతారాజు యాదగిరి, నర్సింగ వెంకన్న, పోతారాజు వెంకన్న,బిరెల్లి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -