Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి

 రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు :  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 3,4 తేదీలలో నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో జరుగు రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న కోరారు. మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజలలో సామాజిక, ఆర్థిక విషయాలు అర్ధం చేయించటానికి ఈ క్లాసులు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రo లోని కాంగ్రెస్, అమెరికా ట్రంప్ లు అనుసరిస్తున్న విధానాలకు మూలం ఏమిటీ అనే అంశాలు బోదిస్తారని అన్నారు.

గుత్త పెట్టుబడి దారులు, సామ్రాజ్యవాదులు తమ దోపిడీని నిరంతరం చేయటానికి నేటి పార్టీలను ఎలా ఉపయోగించుకొట్టున్నారో చెప్పనున్నారని అన్నారు. ఈ క్లాసులను ఇల్లందు మాజీ మ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రారంభించనున్నారని ,సిపిఐ (ఎంల్ )మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర నాయకులు పాయం చిన్న చంద్రన్న, m హమేష్, కొత్తపల్లి రవిలు సిద్ధాంత రాజకీయ అంశాలు బోదిస్తారని అన్నారు. కావున కార్యకర్తలు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై వీటిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జక్కుల యాకయ్యతో పాటు ఎస్ సోమేశ్వర్ రెడ్డి దొడ్డ కేశవులు తోట రవీందర్ జె ఐలయ్య కళాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -