Sunday, May 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెద్దకోడూరులో అగ్నిప్రమాదం..

పెద్దకోడూరులో అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు : చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లచ్చపేట సురేష్ అనే రైతు వ్యవసాయ పొలంలో సమీప ప్రాంతం నుండి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో రైతు మార్కెట్ యార్డు పనిలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్ప్రింక్లర్ పైపులు, కూరగాయల సాగు కోసం ఏర్పాటు చేసిన పందిరి, వ్యవసాయ పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.  నాలుగు ఎకరాల మక్కజొన్న సొప్ప మంటల్లో అంటుకుపోయింది. సుమారు రూ. 1.30 లక్షల  మేర నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కొనుగోలు చేసిన వ్యవసాయ సామగ్రి కాలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పొలం కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన తమను అధికారులు వెంటనే ఆదుకోవాలని, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా తగిన నష్టపరిహారం అందించాలని రైతు లచ్చ పేట  సురేష్‌తో పాటు స్థానిక గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -