- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కనీస ఛార్జీలు, పని పరిస్థితులపై నిరసనగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఫిబ్రవరి 7న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్ సహా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కనీసం ఆరు గంటలపాటు సమ్మె కొనసాగనుంది. దీంతో క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలకు అంతరాయం కలగనుంది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్–2025 అమలు చేసి ప్రభుత్వమే కనీస ఛార్జీలు నిర్ణయించాలని, డ్రైవర్ల ఆదాయ భద్రత, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



