Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద ప్రజల సొంతింటి కల సాకారం చేస్తున్న ప్రభుత్వం 

నిరుపేద ప్రజల సొంతింటి కల సాకారం చేస్తున్న ప్రభుత్వం 

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజల సొంతింటి కల, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాకారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు  పట్టణంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిరమ్మ ఇళ్ల” కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని చెప్పారు. పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

 ఆలేరు పట్టణంలో నిర్మించిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను ఎమ్మెల్యే, బీర్ల అయిలయ్య ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని కొనపురం రేణుక సాయిలు,అంకిరెడ్డి సమ్మయ్య ,చింత కింది వాణి కుటుంబాల ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  ప్రత్యేక పూజలు నిర్వహించి, గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి, పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ .. పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి అర్హత కుటుంబానికి సొంత ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో “ఇందిరమ్మ ఇళ్ల” పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. లబ్ధిదారులు సంతోషంగా కొత్త ఇంటిలో జీవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్  ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వార్డు ప్రజలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -