Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్  కొత్తపల్లి అశోక్ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ సీట్ల సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. కమ్మ ర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో చదివిన విద్యార్థి యెనుగందుల సౌమిత్, విద్యార్థిని జాగర్ల శ్రీజ త్రిబుల్ ఐటీ బాసర క్యాంపస్ లో సీట్లను సాధించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ విద్యార్థులను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవడం ద్వారా గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సున్నం కవిత, పీర్ల అనుష, మాజీ ఎంపిటిసి సభ్యుడు మైలారం సుధాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, పన్నాల రవీందర్, పీర్ల అరవింద్,  గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -