- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బండ సమారం గ్రామంలో దాసరపు రామకృష్ణ, నల్లమాసు బాలరాజు నూతన ఇందిరమ్మ ఇళ్లను గ్రామ సర్పంచ్ కాటిక జంగయ్య యాదవ్ ప్రారంభించి, గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంత ఇంటి కలను సహకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్లమసు రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మహిళలు, గృహ యజమానుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



