నవతెలంగాణ-మిడ్జిల్
మండలంలోని చిల్వేర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి అగ్నిపత్ ద్వారా భారత ఆర్మీకి సెలక్ట్ అయిన దామోదర్ తో పాటు వారి తల్లిదండ్రులు అనిత రాజబాబును సోమవారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..ఆర్మీలో నీ కర్తవ్యాని విస్మరించకుండా, పట్టుదలతో నీ ధర్మాన్ని పాటిస్తూ ఈ భారతవానిలో నీ కీర్తిపతకాని ఎగరవేయాలని సూచించారు. మన గ్రామం నుండి దేశసేవ చేయడానికి అవకాశం రావడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. అదేవిదంగా మన ఊరికి, మన పాఠశాల కు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటయ్య, రమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, అనిత, పాఠశాల వంట ఏజెన్సీ బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థికి ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



