నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి గ్రామపంచాయతీ ఆవరణంలో జాతీయ జెండాలు ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగిందని, అన్యాయాలను చూడలేక తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టి జూన్ 2న తెలంగాణను సాధించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో పంచాయతీ తరపున ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచి పెట్టారు.
మద్నూర్ జీపీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



