నవతెలంగాణ – నాచారం
నాచారం సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్‌లో ఆధార్ నమోదు, అప్‌డేట్ కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించినట్లు సబ్ పోస్టుమాస్టర్ బి. సుభాష్ తెలిపారు. ప్రజలకు ఆధార్ సేవలను సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవాలనుకునే వారు, అలాగే పేరు, చిరునామా, మొబైల్ నంబర్, జనన తేదీ తదితర వివరాలను సవరించుకోవాల్సిన వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు ఆధార్ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన నాచారం సర్కిల్ ప్రజలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆధార్ సంబంధిత పనులను సమయానికి పూర్తి చేసుకోవాలని సబ్ పోస్టుమాస్టర్ బి. సుభాష్ కోరారు. పోస్టల్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ప్రజలకు మరింత చేరువలో ఆధార్ నమోదు, అప్‌డేట్ సౌకర్యాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



