Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు మరింత చేరువలో ఆధార్ నమోదు, అప్‌డేట్ సౌకర్యాలు

ప్రజలకు మరింత చేరువలో ఆధార్ నమోదు, అప్‌డేట్ సౌకర్యాలు

- Advertisement -

నవతెలంగాణ – నాచారం 
నాచారం సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్‌లో ఆధార్ నమోదు, అప్‌డేట్ కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించినట్లు సబ్ పోస్టుమాస్టర్ బి. సుభాష్ తెలిపారు. ప్రజలకు ఆధార్ సేవలను సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవాలనుకునే వారు, అలాగే పేరు, చిరునామా, మొబైల్ నంబర్, జనన తేదీ తదితర వివరాలను సవరించుకోవాల్సిన వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు ఆధార్ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన నాచారం సర్కిల్ ప్రజలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆధార్ సంబంధిత పనులను సమయానికి పూర్తి చేసుకోవాలని సబ్ పోస్టుమాస్టర్ బి. సుభాష్ కోరారు. పోస్టల్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -