- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న ఇందారపు చిన రాజయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందారు. మంగళవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి మృతుని కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, తన వ్యక్తిగతంగా రూ.5 వేలు, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి వ్యక్తిగతంగా క్వింటాలు సన్నబియ్యం, జీపీ కార్యాలయం నుంచి రూ.10 వేలు ఆర్థిక సాయం చేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య,బాపు,తిర్రి అశోక్,పంపు డ్రైవర్ రామిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



