– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని బచ్చువారిగూడెం పంచాయతీ పరిధిలోని ప్రాజెక్టు, రేగడిగుంపు గ్రామాల్లో మంగళవారం సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ గ్రూప్ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి మిర్యాల నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు మాట్లాడుతూ రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జాతీయ కమిటీ పిలుపు మేరకు జూన్ 1 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై నిరసనలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాసిరకం పురుగుల మందుల బారిన పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ ఇన్‌పుట్‌ల సరఫరాలో పారదర్శకత పాటించి రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మండల కార్యదర్శి కంగాల చిన్న వంగరావు, పార్టీ గ్రామ నాయకులు పూసం శారద, ముద్దుగొండ దుర్గారావు, జెట్టి భీమరాజు, జెట్టి లక్ష్ముడు, ఆశి ముత్తమ్మ, పులి సుజాత, కొమరం ముత్తమ్మ, జెట్టి కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.



