Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్లలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు బూడిద సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తాడిచెర్ల హనుమాన్ సెంటర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టియూఎఫ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్ హాజరై మాట్లాడారు. దశాబ్దాల ఆకాంక్ష, ఎందరో వీరుల ఆత్మబలిదానాలు, అక్రమ కేసులు, అరెస్టులను లెక్కచేయకుండా జైలు గోడలను ముద్దాడిన త్యాగధనుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ స్వరాష్ట్రం అని కొనియాడారు.

కవుల అక్షరాలు, కళాకారుల పాటల ఉద్యమ కెరటాల వల్లనే తెలంగాణ సిద్ధించిందన్నారు.అయితే, గత ప్రభుత్వం ఉద్యమకారులను, ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా విస్మరించిందని వారు విమర్శించారు. ఎందరో కొట్లాడి సాధించిన తెలంగాణను కేవలం ఒక్కడి వల్లే వచ్చిందనే అహంకారపూరిత మాటలతో అమరుల త్యాగాలను, ఉద్యమకారులను అవమానించారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ సమాజం గత పాలకులకు తగిన గుణపాఠం చెప్పిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులు టియూఎఫ్ ఫోరం జిల్లా ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, బడితల వెంకటస్వామి, చొప్పరి రాజు, షేక్ చాంద్ పాష, బండారి యశోద, గడ్డం సమ్మక్క, మీనుగు నాగేష్, ఆకుల రాజేశం, ఆకుల సదానందం, బండారి శంకరయ్య, గణేష్, రేకుంట గోవర్ధన్, నవీన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -