- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రము లోని గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ముఖ్య గ్రామ సర్పంచ్ బాద్ మారే సావిత్రిబాయి సాయ గౌడ్ చేతుల మీదుగా సేఫ్టీ కిట్లు అందించమని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిపి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎంపీడబ్ల్యూస్ వర్కర్స్ కి సబ్బులు, నూనెలు దువ్వెనలు, పారిశుద్ధ పనిముట్లు ఇచ్చి వర్కర్ కి సన్మానించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు శాలువాతో సన్మానించి జ్ఞాపకలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపి కార్యదర్శి, సిబ్బంది రాజు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



