- Advertisement -
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డినవతెలంగాణ -పరకాల
పరకాల పట్టణాన్ని విద్యా కేంద్రంగా (ఎడ్యుకేషన్ హబ్) తీర్చిదిద్దుతామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉద్ఘాటించారు. పరకాల పట్టణంలోని పెద్ద
రాజిపేటలో నూతనంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల
పురోగతిపై సమీక్ష జరిపిన ఆయన, పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా
పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి వస్తే స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన
నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, పారదర్శకతతో పనులు జరగాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తామే చేస్తామని, అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.