- Advertisement -
బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళి అర్పించారు. పలువురు తెలంగాణ కళాకారులకు సన్మానం చేశారు. కేసీఆర్‌పై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అబద్ధాలు, విష ప్రచారాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -


