సింగరేణి ఎమ్డీ బుద్దప్రకాశ్ పిలుపు
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సింగరేణి అభివృద్ధికి నిబద్దతతో పని చేయాలని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి కార్మికులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఉత్తమ సేవలందించిన ఎల్. శ్రీనివాస్, వై. లక్ష్మీనారాయణ, డి. రుద్రమ్మను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పోట్రు, జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అభివృద్ధికి నిబద్దతతో పని చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



