Wednesday, June 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ జెండా ఆవిష్కరణలో కూనంనేని

జాతీయ జెండా ఆవిష్కరణలో కూనంనేని

- Advertisement -


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ సాధనలో ఇక్కడి ప్రజల హక్కుల పోరాటాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ పాత్ర అనిర్వచనీయమని, తెలంగాణకు, సీపీఐకి ఉన్నది ’పేగు బంధం’ లాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘మఖ్దూం భవన్‌’ ఘనంగా వేడుకలు నిర్వహించారు. కూనంనేసి సాంబశివరావు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, కలవేన శంకర్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -