Wednesday, June 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతిరుగులేని శక్తిగా శ్రీచైతన్య

తిరుగులేని శక్తిగా శ్రీచైతన్య

- Advertisement -

శ్రీచైతన్యకు జేఈఈ అడ్వాన్స్ డ్ 2026లో
మరో అద్భుత విజయగాథ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ డ్ 2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి తమ అపూర్వ ప్రతిభను చాటుకున్నాయి. సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ డ్ 2026 ఫలితాల్లో సౌతిండియా నెం.1గా శ్రీచైతన్యయే స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 4వ ర్యాంక్ మోహిత్ ఎస్ఎస్ – హాల్ టికెట్ నెంబర్ 266152016, తెలంగాణ బెస్ట్ ర్యాంక్ శ్రీచైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంక్ ఎం.నాగ సహస్ర – హాల్ టికెట్ నెంబర్ 266145246, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంక్ శ్రీచైతన్య విజయవాడ. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంక్ దర్శ సిక్క – హాల్ టికెట్ నెంబర్. 2621050593 (డీఎల్పీ)తో పాటు టాప్ 10 లో 3 ర్యాంకులు, టాప్ 100లో 4, 9, 10, 17, 21, 26, 28, 30, 31, 36, 37, 38, 40, 41, 44, 45, 52, 56, 59, 62, 64, 66, 67, 72, 73, 74, 79, 81, 87, 91, 92, 93, 95, 98, 99 ర్యాంకులతో టాప్ 100లో 35కు పైగా ర్యాంకులు, అలాగే టాప్ 1000లో 196కు పైగా ర్యాంకులు సాధించి తమ అధిపత్యాన్ని మరోసారి శ్రీచైతన్య విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్ 2026లో కూడా శ్రీచైతన్య విద్యార్థులు 300/300 పరిపూర్ణ మార్కులతో రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులను సాధించారు. అదేవిధంగా టాప్ 100లో 27 ర్యాంకులు, టాప్ 1000లో 166 ర్యాంకులు సాధించి అసాధారణ ప్రతిభను కనబరిచారు.
ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడెమిక్ డైరెక్టర్, సీఈఓ సుష్మ బొప్పన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “శ్రీచైతన్యలో అమలు చేస్తున్న వినూత్నమైన పరిశోధనాధారిత శాస్త్రీయ విద్యా కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి అకడమిక్ ప్రణాళికలు, విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం, పరిపాలనా బృందం సమిష్టి కృషి ఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయి. జేఈఈ మెయిన్ , జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో వరుసగా సాధిస్తున్న ఈ అసాధారణ ఫలితాలు మా విద్యా విధానాల ప్రభావాన్ని, నాణ్యతను, నిరంతర శ్రేష్ఠత సాధనను ప్రతిబింబిస్తున్నాయి” అని చెప్పారు. ఐఐటీ మద్రాస్ జోన్ లో టాప్ 500 లోపు 50 శాతంపైగా ర్యాంకులు శ్రీ చైతన్యస్ ఖైవశం చేసుకుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల రంగంలో శ్రీచైతన్య మరోసారి తమ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ, అత్యున్నత ఫలితాలతో విజయపథంలో ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు.
​శ్రీచైతన్య గురించి
1986లో ప్రారంభమైన శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా, అస్సోంలలో 900 శాఖలతో 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు సేవలందిస్తోంది. జేఈఈ, నీట్ టాప్ 100 పర్సంటైల్ ర్యాంక్ హోల్డర్లను, ఆలిండియా టాప్ ర్యాంకర్లను అందిస్తున్నది. నాలుగు దశాబ్దాల్లో శ్రీచైతన్య ఆసియాలోనే అతి పెద్ద విద్యా సంస్థగా అవతరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -