Wednesday, June 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవృత్తిదారుల జీవనోపాధిని మెరుగు పరిచేలా ప్రభుత్వ విధానం ఉండాలి :చెరుపల్లి సీతారాములు

వృత్తిదారుల జీవనోపాధిని మెరుగు పరిచేలా ప్రభుత్వ విధానం ఉండాలి :చెరుపల్లి సీతారాములు

- Advertisement -

వృత్తిదారుల సాంస్కృతిక సంబురాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వృత్తిదారుల జీవనోపాధిని మెరుగు పరిచేలా ప్రభుత్వ విధానం ఉండాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ యం.వి. రమణ అధ్యక్షతన సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా నేటి పరిస్థితులను అన్వయిస్తూ కళారూపాలను ప్రదర్శించాలని సూచించారు. సమాజ పురోగమనానికి కళలు ఉపయోగపడాలన్నారు. జానపదానికి ఎంతో ప్రజాదరణ ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఒగ్గు జానపద కళాకారులు, దుబ్బుల కొలుపు, బ్యాండ్ వాయిద్య, మహిళల బతుకమ్మ, కోలాటం తదితర కళారూపాలు అలరించాయి. తాటి ముంజలు, ప్రకృతి పానీయం కల్లు తో వచ్చిన అశోక్ గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జానపద పాటలు, డాన్స్ లు వేశారు. కార్యక్రమంలో వివిధ వృత్తి సంఘాల నాయకులు పి.ఆశయ్య, లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవిందర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జనగరి దుర్గయ్య, కొప్పు పద్మ, వి. వెంకట నరసయ్య, బోయిరి శ్రీకాంత్, ఇడగొట్టి సాయిలు. ఎదునూరి మదార్, గోరింకల నరసింహ, గంజి మురళి, చెన్నారం మల్లేశం, రాళ్ల బండి కుమారస్వామి, అమీర్పేట మల్లేశం, శేఖర్, గుమ్మడి రాజు నాగరాజు, మారగాని అశోక్ గౌడ్, అబ్బగాని బిక్షం, సురుగు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -