ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట..అమరవీరుల స్థూపం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత
నవతెలంగాణ–హిమాయత్‌నగర్
హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం కాంగ్రెస్, జనసేన నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు కాంగ్రెస్, జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు ‘జై తెలంగాణ.. జై జనసేన’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు అనుమతి నిరాకరణ అంశంపై జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం జరిగింది. పరస్పర నినాదాలతో స్వల్ప తోపులాటకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము నివాళులు అర్పిస్తామని పక్కకు జరగాలని, కాంగ్రెస్ నాయకులతో జనసేన నాయకులు గొడవకు దిగారు. ఈ క్రమంలో వాదోపవాదాలు కొనసాగాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది.
గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ వర్సెస్ జనసేన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



