నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగిన ఘటనలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. మరికొంతమంది చిక్కుకొని ఉంటారని సమాచారం.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఢిల్లీ, మాల్వియ నగర్‌లోని లెమన్ గ్రీన్ అనే రెస్టారెంట్‌లో ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మొదలైన మంటలు తర్వాత పై అంతస్తుల వరకు వ్యాపించాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్తలానికి చేరుకున్నాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సిబ్బంది శ్రమించి 11 మందిని రక్షించారు. 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



