నవతెలంగాణ-వర్ధన్నపేట
గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యాలు కావాలని జనాభా గణనలో ప్రజలు సహకరించి సమస్యలను అధికారుల దృష్టికి తేవాలని వర్ధన్నపేట తహసిల్దార్ విజయసాగర్ అన్నారు. వర్ధన్నపేట మండలంనల్లబెల్లిలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామసభను గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅధితులుగా వర్ధన్నపేట మండల తహసిల్దార్ విజయసాగర్ హాజరై మాట్లాడారు భారతదేశంలో డిజిటల్ పద్ధతిలో జనగణన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు మొదటి దశలలో గృహాల వారి జాబితా గృహ గణన జరుగుతుందన్నారు ప్రజలు వారి యొక్క వివరాలు సంపూర్ణంగా తెలియజేయాలని అన్నారు. ప్రజలు సహకరించి గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు వర్షాకాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో
సురక్షితమైన తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు.
గ్రామంలో మొక్కలను పెంచాలని అనుభవచో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.వర్ధన్నపేట ఎస్సై సాయిబాబా మాట్లాడుతూ గ్రామంలో భద్రత కొరకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పై అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రజలకు పలు సూచనలు అందించారు సైబర్ నేరాలకు టోల్ ఫ్రీ నెంబర్1930 డయల్ చేయాలని సైబర్ నేరాలకు ఎవరైనా గురి అయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలియజేశారు.
గ్రామ సర్పంచ్ జక్కీ అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు పరిష్కరించడంలో ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామని, ఘన వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని జల సంరక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ వర్షాకాలం గ్రామంలో అత్యధిక మొక్కలు పెంచడంలో ప్రణాళికలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల ఏపీవో నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈ అమరనాథ్, పంచాయతీ కార్యదర్శి షేక్ హుస్సేన్, గ్రామ వార్డు సభ్యులు,
గ్రామస్థాయి అధికారులు, రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



