Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆటలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం 

ఆటలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
ఆటలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని, స్నేహాలు పెరుగుతాయని ఎంపీడీవో నాగేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి సీఎం కప్ ఫుట్బాల్ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. బాలుర విభాగంలో మొదటి స్థానంలో రామారెడ్డి, రెండవ స్థానంలో కామారెడ్డి, బాలికల విభాగంలో మొదటి స్థానంలో కామారెడ్డి, రెండవ స్థానంలో రామారెడ్డి నిలిచాయి. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్ రావు, ఆర్ఐ రవికాంత్, స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్, పోసానిపేట సర్పంచ్ సుద్దాల లింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్, నాయకులు రవీందర్ గౌడ్, నామాల రవి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -