నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో శుక్రవారం పలువిత్తనాలు, ఎరువుల దుకాణాలను, మండల వ్యవసాయ అధికారిణి రచన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దుకాణాల్లో నిల్వ ఉంచిన విత్తనాల బిల్లులు, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డును తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. అధికారిక లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద నుంచే రైతులు విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. డీలర్లు రైతులకు తప్పనిసరిగా బిల్ ఇవ్వాలని, ఆ బిల్పై లాట్ నంబర్ కూడా తప్పకుండా పేర్కొనాలని తెలిపారు. సరైన లేబులింగ్, ప్యాకేజింగ్ ,లాట్ నంబర్ ఉన్న విత్తనాలనే అమ్మాలని పేర్కొన్నారు.



