Friday, June 5, 2026
E-PAPER
Homeసినిమా'మొహబ్బత్`షూటింగ్ షురూ..

‘మొహబ్బత్`షూటింగ్ షురూ..

- Advertisement -

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేశారు. దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ,’నిర్మాత అఫ్రోజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ఈ సినిమా రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని అన్నారు. ‘నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నానుఅని నిర్మాత అఫ్రోజ్ షేక్ చెప్పారు. హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ,'ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇది నాకు రెండో చిత్రం అని తెలిపారు. ‘మా దర్శక, నిర్మాతలు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. ఇలాంటి ప్రేమకథకు సంగీతం ప్రధా నం. సునీల్ కశ్యప్ తో పని చేయటం ఆనందంగా ఉంది’ అని హీరో సంతోష్ కల్వచెర్ల అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -