Friday, June 5, 2026
E-PAPER
Homeసినిమామా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు

మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు

- Advertisement -

హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుద లైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శ కుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజ యాన్ని సాధించింది. అన్ని ప్రాం తాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయ వంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ,’ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్య వాదాలు. ‘పెద్ది’ చిత్రం అద్భుతంగా దూసుకుపోతోంది. తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యం గా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చాలా అద్భు తంగా ఉంది. సినిమా చూసిన వారందరూ ఇది చాలా మంచి సినిమా అని అభినందిస్తున్నారు. ఇది నిజంగా బ్రహ్మాండమైన సినిమా. అందరూ తమ పిల్లలను తీసుకుని థియేటర్లలో సినిమా చూడండి.

ఇది రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపె నింగ్స్ వచ్చాయి. టికెట్ రేట్ల విషయంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వా లకు ప్రత్యేక ధన్యవాదాలు. భారీ స్థాయిలో, అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మించాం. ఆ కృషికి ప్రభుత్వాలు ఎంతో సానుకూలంగా స్పందించాయి. చాలా కీలక సమ యంలో మాకు అండగా నిలిచారు. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు. అందరూ సినిమాను నమ్మి అతిపెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలబెట్టారు. మీడియా కి ధన్యవాదాలు. ఒక మంచి సినిమాకు మీరందరూ అండగా నిలిచారు. సినిమా గురించి అందరూ చాలా బాగా రాశారు. రామ్ చరణ్, బుచ్చిబాబుకి మరోసారి ధన్యవాదాలు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నేను చేసిన తొలి సినిమాకే ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానుఅని తెలిపారు. 'మనం ఊహించి నట్లుగానే ఇది ఒక సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది. భారీ స్థాయిలో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సినిమా ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తుంది అని నిర్మాత రవిశంకర్ అన్నారు.

‘అందరూ ఫోన్ చేసి పెద్ద హిట్ అయ్యిందని చెబుతున్నారు. సినిమా చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యామని అంటున్నారు. ‘పెద్ది’ ఒక ఇన్‌స్పిరేషనల్ క్యారెక్టర్. చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడు కోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబాలు కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. నేను నమ్మిన విషయాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా మరింత అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను`.
దర్శకుడు బుచ్చిబాబు సానా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -